నేడు ఆలయంలో దండల ఉత్సవం

KRNL: దేవనకొండ మండలం నల్లచెలిమల గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం దండల ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రావణమాసం మూడవ శనివారం జరిగే ఈ ప్రత్యేక ఉత్సవంలో, గ్రామస్థులు గన్నేరు పూలతో తయారు చేసిన మూడు దండలను స్వామికి సమీపంలో ఉన్న పెద్ద రాళ్ల మధ్య నుంచి కిందకు వదులుతారు. దండలు నలిగే శాతాన్ని బట్టి, రాబోయే పంటల గురించి రైతులు జోస్యం చెబుతారు.