శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాల

NGKL: ఉప్పునుంతల మండలం రాయిచేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. 36 సంవత్సరాల క్రితం నిర్మించిన పాఠశాలలో 1 వ తరగతి నుంచి 5 వ తరగతి వరకు బోధన సాగిస్తున్నారు. భవనం పైకప్పు పెచ్చులు ఊడిపోవడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువు కొనసాగిస్తున్నారని, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమత్తులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.