అక్రమ క్వారీ బ్లాస్టింగ్‌ను తక్షణమే ఆపాలని డిమాండ్
ATP: కళ్యాణదుర్గం YCP సమన్వయకర్త తలారి రంగయ్య సోమవారం ఆర్డీవో కార్యాలయంలో అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, యాటకల్లు, ఐదుకల్లు మధ్య దేవరకొండలో జరుగుతున్న అక్రమ క్వారీ బ్లాస్టింగ్‌ను తక్షణమే ఆపాలని కోరారు.