సైబర్ క్రైమ్ పోలీసులు.. 37 మంది నిందితుల అరెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులు.. 37 మంది నిందితుల అరెస్ట్

HYD: సైబర్ క్రైమ్ పోలీసులు గత ఏడు నెలల కాలంలో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు చేపట్టారు. వివిధ రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్‌లను గుర్తించి సమన్వయంతో దాడులు నిర్వహించారు. ఈ చర్యల్లో మొత్తం 37 మంది నిందితులను అరెస్టు చేసి, పలువురి నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.