ప్రపంచ సదస్సు కోసం పర్యాటక ప్రాంతాల అలంకరణ
విశాఖ: ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో, విశాఖలో పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన వుడా పార్కు, తెన్నేటి పార్కు, సబ్ మెరైన్ వంటి ప్రాంతాలను పరిశీలించారు.