శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ఏడుగురు దళారులపై కేసు

TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో దళారులుగా వ్యవహరిస్తున్న ఏడుగురిపై బైండోవర్ నమోదు చేసినట్టు వన్ టౌన్ సీఐ గోపి తెలిపారు. సోమవారం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దళారులుగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బైండోవర్ చేయడానికి అక్కడి నుంచి ఆర్డీవో వద్దకు తీసుకెళ్లారు. భక్తులను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు.