కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి: మంత్రి
TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు.