పొలం పనులు చేస్తూ కుప్పకూలిన రైతు

పొలం పనులు చేస్తూ కుప్పకూలిన రైతు

మెదక్: పొలం పనులు చేస్తుండగా గుండెపోటుతో రైతు మృతి చెందిన ఘటన శనివారం రామాయంపేట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన ఉస్తెపు స్వామి (45) తన వ్యవసాయ పొలంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.