నేటి నుంచి ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు

నేటి నుంచి ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు

ప్రకాశం: రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. తాళ్లూరు మండలంలో శని, ఆదివారాలలో పోటీలను నిర్వహిస్తున్నట్లు PET శంకర్ తెలిపారు. మహిళలకు త్రోబాల్, పురుషులకు క్రికెట్ పోటీలు ఉంటాయని చెప్పారు. మానసిక, శారీరక, వృత్తిపరమైన ఒత్తిడి అధిగమించేందుకు క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు.