కొమరోలులో నేడు పవర్ కట్
ప్రకాశం: కొమరోలు మండలంలోని తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని పొట్టిపల్లెలో ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనులు చేస్తున్న నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలో విద్యుత్ సరఫరాను ఉందన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని తెలిపారు.