ఘనంగా మే డే వేడుకలు

PDPL: రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్, సేవా సమితి ఛైర్మన్ మనాలి ఠాకూర్ ఆధ్వర్యంలో మే డే వేడుకలు నిర్వహించారు. లక్ష్మీ నగర్‌లోని హమాలీ సంఘం కార్యాలయంలో జెండా ఆవిష్కరించి, కార్మికులను సన్మానించారు. ఆమె మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. కార్మిక నాయకులు యాకయ్య, మహిళలు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు.