రైతులకు స్ప్రింకర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NGKL: వంగూరు మండలంలోని ఉప్పలపహాడ్ గ్రామంలో ఎమ్మెల్యే వంశీ కృష్ణ ప్రభుత్వం నుంచి మంజూరైన స్ప్రింకర్లను రైతులకు స్వయంగా అందజేశారు. సాగునీటి వృథాను తగ్గించడంలో స్ప్రింకర్ల ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులకు పంటలకు సమయానికి నీరు అందించడంలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. ప్రతి రైతుకూ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటామని వాగ్దానం చేశారు.