శ్రీకేతకి ఆలయంలో సంగమేశ్వర స్వామికి మంగళ హారతి
SRD: తెలంగాణలో దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో ఆదివారం స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. పాల్గుణ మాసం కృష్ణ పక్షం ఏకాదశి భానువాసరే పురస్కరించుకుని పార్వతీ సంగమేశ్వర స్వామికి పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతర మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు.