ఎకనామిక్స్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
KMM: ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఎకనామిక్స్ బోధించేందుకు (ఒక పోస్టు) అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డా.మహ్మద్ జకీరుల్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సంబంధిత ధ్రువపత్రాలను కళాశాల కార్యాలయంలో సమర్పించాలని, 7న ఉదయం 11 గంటల నుంచి కళాశాలలో ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పారు.