NH- 63 విస్తరణ పనులు పరిశీలించిన కలెక్టర్
MNCL: ఆర్మూర్ నుంచి చంద్రాపూర్ NH-63 పనులను మందమర్రి మండలం తిమ్మాపూర్ ప్రాంతంలో మందమర్రి MROతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. NH- 63 విస్తరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులు పరిశీలించారు.