వేతనదారుల బకాయిలు చెల్లించాలి
AKP: ఉపాధి హామీ పథకం వేతనదారులకు 11 వారాల బకాయిలు చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం కోటవురట్ల మండలం పీ.కొత్తపల్లిలో పని ప్రదేశంలో ఉపాధి వేతనదారులతో సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు పూటలు ముఖ ఆధారిత హాజరు అమలు చేయడంతో వేతన దారులు పలు అవస్థలు పడుతున్నట్లు పేర్కొన్నారు.