అయినవిల్లిలో ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు
కోనసీమ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా జరిగిన శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు చేశారు.