మొరాయించిన అంబులెన్స్
సత్యసాయి: జిల్లా నల్లచెరువు పోలీస్ స్టేషన్ ఎదుట బైక్‌పై నుంచి కింద పడ్డ దంపతులను ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్ మొరాయించింది. వాహనం స్టార్ట్ కాకపోవడంతో ఎస్సై మక్బూల్ బాషా, పోలీసులు, స్థానికులు కలిసి అంబులెన్స్‌ను వెనుక నుంచి తోశారు. వాహనం స్టార్ట్ అయిన తర్వాత క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్‌లు ఇలా ఉంటే ఎలా అని నెటిజన్స్ విమర్శిస్తున్నారు.