రేబీస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని డిమాండ్
MDCL: చర్లపల్లిలో రేబీస్ వ్యాధి నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీధి కుక్కల సంఖ్య పెరగడంతో ప్రజల్లో భయం నెలకొంది. ఇటీవల కుక్కల కాట్ల ఘటనలు పెరగడంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టీకాలు, పట్టివేత కార్యక్రమాలు చేపట్టి ప్రజల భద్రతను నిర్ధారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.