వైద్యాధికారుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆసిఫాబాద్ జిల్లాలో PM జన్మన్ పథకం కింద ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 3 వైద్యాధికారుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పరిశీలించాలి. మార్చి 30న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ వైద్య కళాశాలలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలు, జిరాక్సులు, 2 ఫొటోలతో హాజరు కావాలన్నారు.