'విస్తీర్ణ ఆధారంగా ఎరువులను పంపిణీ చేయాలి'

KNR: దుర్షేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలోని ఎరువుల విక్రయ కేంద్రాన్ని, గోదామును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. గోదాములో నిలువలను, విక్రయ కేంద్రం స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. రిజిస్టర్‌లో రైతువారీగా అమ్మకాలు నమోదు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విస్తీర్ణం ఆధారంగా రైతులకు ఎరువులు పంపిణీ చేయాలని తెలిపారు.