భూభారతి ద్వారా భూ సమస్యలకు పరిష్కారం: కలెక్టర్

NLG: ధరణిలో పరిష్కారం లేని భూ సమస్యలకు భూభారతి ద్వారా పరిష్కారం దొరుకుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణ భూభారతిపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా ఆదివారం ఆమె తిప్పర్తిలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.