చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP
ASF: చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ ను ఆసిఫాబాద్ జిల్లా SP నితికా పంత్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని SP సూచించారు. ప్రజా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.