మాదక ద్రవ్యాలతో భవిష్యత్తు ప్రశ్నార్థకం

NRML: మాదక ద్రవ్యాల వినియోగంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ సరిత సూచించారు. బుధవారం ఆ కళాశాలలో మాదకద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాలను సేవిస్తే భవిష్యత్తు పాడవుతుందని, వాటికి దూరంగా ఉండాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారి సంతోష్ ఉన్నారు.