నేపాల్ లీగ్ ఆడనున్న మరో భారత స్టార్ క్రికెటర్
నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో మరో భారత స్టార్ క్రికెటర్ అడుగు పెట్టనున్నాడు. దేశవాలీ స్టార్ బ్యాటర్ ప్రియాంక్ పంచల్ NPL ఆడేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో ప్రారంభం కానున్న 2025 ఎడిషన్ కోసం కర్నాలి యాక్స్ ఫ్రాంచైజీతో చేతులు కలిపాడు. గుజరాత్‌కు చెందిన పంచల్‌కు దేశవాలీ సూపర్ స్టార్‌గా పేరుంది. కాగా, తొలుత ఈ లీగ్‌లో పంచల్ కంటే ముందు శిఖర్ ధావన్ ఆడాడు.