VIDEO: శాంతించిన గోదావరి

VIDEO: శాంతించిన గోదావరి

E.G: కొన్ని రోజులుగా ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది ప్రస్తుతం శాంతించింది. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 10 అడుగులకు చేరింది. బ్యారేజీ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు తొలగించారు. 7,52,579 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. డెల్టా కాలువలకు 13,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.