పల్లె నిద్రతో ప్రజలకు చేరువవుతున్న పోలీసులు
KDP: ఉష్టి కాయల పల్లి గ్రామంలో తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సై మంజునాథ ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులతో సమావేశమై సైబర్ మోసాలపై అవగాహన కల్పించి, అనుమానాస్పద కాల్స్ వస్తే 112 లేదా 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు.