నేడే మినీ జాబ్ మేళా
SRCL: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 21న జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేందర్ సోమవారం తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాకు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుందన్నారు.