ఆధార్ ప్రత్యేక శిబిరాన్ని సందర్శించిన ఎంపీడీవో
VZM: గంట్యాడ మండలం లక్కిడాం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధార్ ప్రత్యేక శిబిరాన్ని మంగళవారం ఎంపీడీవో రమణమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆధార్ అప్డేట్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన పలు విషయాలపై ఆరా తీసి అక్కడ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు.