అనాధ బాలికకు హెల్త్ స్కీమ్ కార్డు పంపిణీ
ప్రకాశం: ఒంగోలు, గిద్దలూరు బాల సదన్లలోని అనాధ బాలికలకు అమృత హెల్త్ స్కీం ద్వారా ప్రైవేట్ ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ హాస్పిటల్స్‌లో ఉచిత వైద్యసేవలు అందించేందుకు హెల్త్ కార్డులను జిల్లా కలెక్టర్ రాజాబాబు చేతుల మీదుగా సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లో అందజేశారు. బాలికలకు అనారోగ్య సమస్యలుంటే వెంటనే నెట్వర్క్ హాస్పిటల్స్‌లో ఉచిత వైద్యం పొందాలని కలెక్టర్ సూచించారు.