VIDEO: పట్టణ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన నగేష్
ADB: కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడి పదవికి గుడిపల్లి నగేష్ రాజీనామా చేస్తున్నట్లు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన జిల్లా రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు.