రౌడీ షీటర్‌లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ

కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ సోమేశ్వరరావు రౌడీ షీటర్‌లకు ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. గతంలో నేర చరిత్ర కలిగిన వారు ఇకపై, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా, ప్రవర్తనను మార్చుకుని సమాజంలో మంచి వ్యక్తులుగా జీవించాలని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ చంటిబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.