నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి: ఎస్పీ

NLG: వినాయక నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు. డీజేలకు, అధిక శబ్ద లౌడ్‌స్పీకర్లకు అనుమతి లేదని తెలిపారు. విగ్రహాలు రోడ్డు ఇరుపక్కలే ప్రతిష్టించి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కమిటీ నిర్వాహకులు పోలీస్ సూచనలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.