సిరప్లు నిషేధం.. ప్రజలకు అమ్మొద్దు

సిరప్లు నిషేధం.. ప్రజలకు అమ్మొద్దు

ADB: చిన్నారుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన దగ్గు మందులపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిందని జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆడే శ్రీలత తెలిపారు. రిలీఫ్, రెస్పి ఫ్రెష్-TR సిరప్లను వాడొద్దని తమకు ఉత్తర్వులు వచ్చాయన్నారు. దగ్గు మందు తాగడంతో ఇటీవల మధ్యప్రదేశ్‌లో 11 మంది చిన్నారులు మృతి చెందరన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మెడికల్ షాపుదారులు ఈ మందులను అమ్మొద్దని సూచించారు.