VIDEO: 'కావలికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి యానాదిరెడ్డి'

NLR: కావలి పట్టణంలో సోమవారం దివంగత నేత మాజీ ఎమ్మెల్యే కలికి యానాదిరెడ్డి వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేశారు. యానాదిరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కావలి పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి కలికి యానాదిరెడ్డి అని ఎమ్మెల్యే కొనియాడారు.