దోమల నియంత్రణపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: డీఎంహెచ్‌వో

PPM: దోమల వ్యాప్తి నియంత్రణపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు పేర్కొన్నారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్లో బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌వో, వైద్య అధికారులు ముందుగా సర్ రోనాల్డ్ రాస్‌కి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సదస్సులో పాల్గొని పలు సూచనలు చేశారు.