సింహాచలం ఘటన చాలా బాధాకరం: రేవు శ్రీను

కోనసీమ: సింహాచలంలో సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్బంగా గోడకూలి 8 మంది భక్తులు మృతి చెందడం బాధాకరమని కే.గంగవరం మండలం కోటిపల్లి టీడీపీ సీనియర్ నాయకులు రేవు శ్రీను బుధవారం విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.