నేటి నుంచి మునిసిపల్ పార్కు మూసివేత

నేటి నుంచి మునిసిపల్ పార్కు మూసివేత

VZM: బొబ్బిలి పట్టణంలోని రాణి మల్లమ్మదేవి మున్సిపల్‌ పార్కును శుక్రవారం నుంచి ఈనెల 24 వరకు మూసి వేయనున్నట్లు మునిసిపల్ కమిషనర్‌ ఎల్‌. రామలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్కు సుందరీకరణ పనులలో భాగంగా రంగులు వేయిస్తున్న కారణంగా సందర్శకులు రాకుండా తాత్కాలికంగా పార్కును మూసి వేస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు.