అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలి: కమిషనర్
BHPL: కాలేశ్వరంలోని త్రివేణి విశ్రాంతి భవనంలో ఇవాళ దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆలయాల పునరుద్ధరణ, పునఃప్రతిష్ట, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 20న ఆలయ పునఃప్రతిష్ట పనుల శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నందున శిలాఫలకం, భూమి పూజ పనులకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.