చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యం కొనాలి: కలెక్టర్

PDPL: రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సోమవారం ఎలిగేడు మార్కెట్ యార్డుతో పాటు ధూళికట్ట, బుర్హాన్ మియాపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెరిగిందని, నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనాలన్నారు.