బిహారీల కోసం ఎదురుచూపులు

బిహారీల కోసం ఎదురుచూపులు

MDK: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు హమాలీల కొరత వేధిస్తోంది. బిహార్ నుంచి రావాల్సిన హమాలీలు ఇంకా రాకపోవడంతో చాలా కేంద్రాల్లో తూకం ప్రారంభం కాలేదు. ఇప్పటికే కోతలు పూర్తయి ధాన్యం రాశులు కల్లాల్లో, రోడ్లపైనే ఉన్నాయి. ఆలస్యమైతే ధాన్యం ఎండిపోయి బరువు తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి హమాలీలను రప్పించి, తూకం చేయించాలి.