టాస్క్ సెంటర్ కోర్సులపై విద్యార్థులకు అవగాహన

PDPL: జిల్లాలో ప్రాంతీయ టాస్క్ సెంటర్ అందించే కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లో యువత ఉపాధిపై ప్రిన్సిపాల్‌తో సమీక్షించిన ఆయన, టాస్క్ సెంటర్ ద్వారా డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.