'దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి'

'దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి'

NDL: మే 20న దేశవ్యాప్తంగా సీఐటీయూ నాయకత్వాన సమ్మె నిర్వహిస్తున్నామని కార్మికులు పాల్గొని, హక్కులు సాధించుకోవాలని ఏపీ వ్యాకాస జిల్లా నాయకులు ఎం.కర్ణ పిలుపునిచ్చారు. జూపాడు బంగ్లా మండలం, పారుమంచాల ఆరోగ్య కేంద్రంలో నేడు డాక్టర్ మౌనికకు ఆశ కార్యకర్తలతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించిన ఆశాల సమస్యలు పరిష్కరించాలన్నారు.