ఎస్సారెస్పీ కాల్వలకు చేరుకున్న గోదావరి జలాలు

SRPT: తిరుమలగిరి మండలం వెలిశాల వద్ద గల ఎస్సారెస్పీ కాల్వలకు గోదావరి జలాలు మంగళవారం చేరుకున్నాయి. వారబందీ విధానంలో వారం రోజులపాటు గోదావరి జలాలను ఎస్సారెస్పీ కాలువలకు విడుదల చేసినట్లు నీటిపారుదశాఖ అధికారులు డీఈ సత్యనారాయణ, ఏఈ అమర్ తెలిపారు. నీటిని వృథా చేయకుండా రైతులు పంట పొలాలకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.