రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కరీంనగర్: కారు బైక్‌ను ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం బెజ్జంకి మండలంలో చోటుచేసుకుంది. కరీంనగర్‌కు వెళుతున్న ఓ కారు బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ క్రాసింగ్ వద్ద బైక్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడిని మండలంలోని గాగిల్లపూర్ గ్రామానికి చెందిన సత్తయ్యగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.