నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
WGL: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద, సాధారణ పరిశీలకులు బాలమాయాదేవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిబంధనల అనుగుణంగా చర్యలు జరుగుతున్నాయా? అని ఖానాపూర్ మండలం బుధవారిపేట, నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి క్లస్టర్లను వారు సందర్శించారు.