సింహాద్రి అప్పన్నకు స్వర్ణపుష్పార్చన

VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి స్వర్ణ పుష్పార్చన గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.