'మద్దికేర-మొలగవల్లి రోడ్డు ధ్వంసం చేసిన దుండగులు'

KNL: మద్దికేర నుంచి మొలగవల్లి వరకు రోడ్డు పూర్తి చేసి మూడు నెలలు కూడా కాకముందే కొందరు దుండగులు రోడ్డును ధ్వంసం చేశారు. రూ.8.50 కోట్లు ఖర్చుపెట్టి 15 కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. కొందరు గిట్టనివారు వాహనాల ద్వారా రోడ్డును విచ్చలవిడిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్థానిక వైసీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై రమేశ్ బాబు తెలిపారు.