పబ్బతిరెడ్డి లక్ష్మమ్మకు శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్సీ
NLG: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పబ్బతిరెడ్డి వెంకట్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఇటీవల మరణించింది. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్సీ నెలికంటి సత్యం మాజీ ఎంపీపీ గృహంలో లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.