సింగపేట రామన్న చెరువు కలుజు ప్రాంతాన్ని పరిశీలించిన తహసీల్దార్
NLR: దిత్వా తుఫాను కారణముగా అల్లూరు మండలంలో నిన్న 83 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఇంకా వర్షాలు కురుస్తున్నందున, తహసీల్దారు లక్ష్మీనారాయణ సోమవారం సింగపేట రామన్న చెరువు కలుజు ప్రాంతాన్ని పరిశీలించారు. కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.